టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మహేష్ నటించిన ‘మహర్షి’సినిమాపైనే చర్చలు సాగుతున్నాయి.  మహేష్ బాబు కి ఇది 25వ సినిమా..అందుకు తగ్గట్టుగానే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు..వారు దళారుల చేతుల్లో చిక్కి ఎలా నష్టపోతున్నారు.. వారిని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరక ఎలా గౌరవించాలో..ఎలా లాభాలు కలిగేలా చూడాలో ఈ సినిమాలో చూపించారు.  ఇక మహేష్ బాబు అయితే ముడు రకాల పాత్రలు కాలేజ్ స్టూడెంట్, బిలీనియర్, ఒక సామాన్య రైతు పాత్రల్లో నటించి తన విశ్వరూపం చూపించారు.


ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం..మంచి కలెక్షన్లు రాబట్టడం జరుగుతుంది.  నిన్న హైదరాబద్ లో నోవాటేల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మహేష్ బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే.  మహర్షి సినిమా వంశి, నన్ను కాలర్ ఎగరేసేలా చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.  ప్రెస్ మీట్ పూర్తయిన తరువాత చిత్రబృందం పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో మహేష్ బాబు చాలా జోష్ గా కనిపించారు.  మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లిని ఎంతో సంతోషంగా ముద్దు పెడుతున్నారు. 


ఈ ఫోటో షేర్ చేసిన వంశీ ''నా బెస్ట్ మూమెంట్.. ఇంతకు మించి ఇంకేం కోరుకోను'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది..మహేష్ బాబు సంతోషానికి అవధులు లేవని..తన సంతోషాన్ని ఇంత మంచి మనసుతో దర్శకుడికి అందించారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: