'మహర్షి' సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా హాలు మొత్తం కలకలలాడి పోతున్నాయి. తన కెరియర్ లో 25వ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మహేష్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ తో పలు మీడియా సమావేశాలు నిర్వహించి ఆనందం పంచుకున్నారు.

Image result for maharshi

అంతేకాకుండా ఈ సమ్మర్ లో మహేష్ సినిమా తప్ప వేరొక సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ప్రబలమైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది మహర్షి. అయితే ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మహేష్ తన స్టామినా నిరూపిస్తున్నాడు. ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ ఈ సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించాడు. తమిళనాడులోని ప్రధానమైన ఏరియాల్లో తమిళ జనాలు మహర్షి సినిమాపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Image result for maharshi

ఇప్పటికే చెన్నై లో 64 లక్షలకు పైగా కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా చెంగల్ పెట్ ఏరియాలో 1.21 కోట్లను కలెక్ట్ చేసింది. కోలీవుడ్ లో కూడా ఇప్పుడు మంది సినిమాలేమి లేవు. దీంతో మహర్షికి ఈ స్పెస్ బాగా కలిసొచ్చింది. ఈ వారం కూడా మినిమమ్ వసూళ్లు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా థియేటర్స్ సంఖ్యని కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: