టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని అందరి స్టార్ హీరోలతో జత కట్టిన భామ కాజల్ అగర్వాల్. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో జోడీ కట్టిన ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత అనే సినిమాలో పొగరుబోతు బిజినెస్ విమెన్ గా కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ లో సినిమా మొత్తం కాజల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని అర్ధమవుతుంది.

ఇక ఈ భామ ఇప్పటికే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఖైది నెంబర్ 151 సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక తాజాగా కమల్ హసన్ కి జోడీగా భారతీయుడు సీక్వెల్ కూడా సందడి చేస్తుంది. ఈ మరో బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోలతో జోడీ కట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోల కి ఫస్ట్ ఛాయస్ గా ఉన్న ఈ భామ నయనతార లానే కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ గురించి టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది.

ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాలో మరో సారి బాలయ్యకి విలన్ గా జగపతి బాబు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలించిన దర్శకుడు  ఫైనల్ గా స్టార్ హీరోయిన్ కాజల్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. కాజల్ కూడా బాలకృష్ణ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: