విజయ వాహిని స్టూడియోస్ అధినేత ప్రముఖ నిర్మాత బి.వెంకట్రామిరెడ్డి (75) కన్నుమూశారు. తాజాగా ఆయన మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు దక్షిణాది సినిమా రంగంలో ఉన్న ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు బాధపడ్డారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో బాధపడుతున్న బి.వెంకట్రామిరెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడిచారు.


బి.వెంకట్రామిరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దిగ్గజం హీరోలతో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించారు. విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్ లో ఎన్టీఆర్-ఏఎన్నార్- సావిత్రి- భానుమతి వంటి క్లాసిక్ స్టార్స్ ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నిర్మాత బి.నాగిరెడ్డి ఈ చిత్రాల్ని నిర్మించారు. ఆయన చిన్న కుమారుడే ఈ వెంకట్రామిరెడ్డి. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ బ్యానర్పై పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు.

Image result for bhairava dweepam telugu movie

తెలుగులో శ్రీకృష్ణార్జున విజయం.. బృందావనం.. చిత్రాల్ని నిర్మించారు. ముఖ్యంగా బాలకృష్ణ కెరీర్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇప్పటికీ టీవీ లో వస్తే అందరూ ఆసక్తిగా చూసే సినిమా `భైరవ ద్వీపం` వంటి భారీ చిత్రాన్ని వెంకట్రామిరెడ్డి నిర్మించారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఇంత అద్భుతమైన ఈ చిత్రాన్ని నిర్మించిన వెంకటరామిరెడ్డి మృతి చెందటం నిజంగా బాలకృష్ణ అభిమానులకు తట్టుకోలేని వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: