ఎన్టీఆర్ బయోపిక్ మొదట తేజా దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాస్త షూటింగ్ అయ్యాక తేజ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ ఆ బాధ్యత చేపట్టాడు. కానీ ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. చివరకు ఎన్టీఆర్ ఇమేజ్‌ కూడా పాడు చేశారన్న విమర్శలు వచ్చాయి. 


మరి ఈ సినిమాపై తేజ ఏమంటున్నారు.. ఇదీ ఇంట్రస్టింగ్.. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ కొన్ని కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ సినిమా చేసేంత శక్తి తనకు లేదని తానే స్వచ్చంధంగా బయటకు వచ్చేశానని తేజ అంటున్నారు. తననెవరూ బలవంతం చేయలేదని.. ఎన్టీఆర్ ఫాన్ అయిన తాను.. సరిగ్గా చేయలేనేమోనని బయటికొచ్చానన్నారు. 

మరి ఇంతకూ ఆ సినిమాలు బాగా వచ్చాయా అని అడిగితే.. తాను ఆ రెండు సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదని.. కనీసం ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలు చూస్తే.. కంపేరిజన్ వస్తుందని.. ఎవరైనా సినిమా ఎలా ఉందంటే తాను నిజం చెప్పాల్సివస్తుందని అన్నాడు. 

అందుకే తాను ఆ సినిమాలు చూడలేదని వివరణ ఇచ్చాడు తేజ. ఒక వేళ తాను తీసినా అంతకంటే చెత్తగా తీసేవాడినేమో అని తేజ అంటున్నాడు. గతంలో చాలా దూకుడుగా ఉండే తేజ.. ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. అనుభవం తెచ్చిన పెద్దరికం తేజలో స్పష్టంగా కనిపించింది. అంతేగా మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: