సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మిక్స్‌డ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌హేష్ కెరీర్‌లోనే 25వ సినిమాగా తెర‌కెక్కిన మ‌హ‌ర్షి సినిమాను ముగ్గురు టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌లు నిర్మించారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా కేవ‌లం 4 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.65 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. 

మ‌హేష్ కెరీర్‌లో పాత రికార్డుల‌కు పాత రేస్తూ... కొన్ని చోట్ల నాన్ బాహుబ‌లి, మ‌రికొన్ని చోట్ల బాహుబ‌లి 1 రికార్డుల‌ను కూడా బ్రేక్ చేసింది. ఏపీలోని రాజ‌ధాని ప్రాంత‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మ‌హ‌ర్షి ఐదో రికార్డు స్థాయిలో షేర్ రాబ‌ట్టింది. గుంటూరులో మహర్షి ఐదో రోజు షేర్ 22.5 లక్షలుగా ఉంది. మొత్తం ఐదు రోజులకు గానూ మాహర్షి గుంటూరులో 6.125 కోట్లు రాబ‌ట్టింది.

ఇక కృష్ణా జిల్లాలో కూడా మ‌హ‌ర్షి ఏకంగా ఐదో రోజు 27.4 లక్షలు తెచ్చుకుని.. మొత్తం నాలుగు రోజుల‌కు రూ.  3.90 కోట్లను కలెక్ట్ చేశాడు. ఈ సినిమా గురువారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ వ‌చ్చాక కూడా సోమ‌వారం వీక్ డేస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రాబ‌ట్ట‌డం మామూలు విష‌యం కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి.  ఓవ‌రాల్‌గా ఈ సినిమాతో మ‌హేష్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు రాబ‌ట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: