పూరి జగన్నాధ్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. అతని సినిమాల్లో హీరోలు అందరు ఒక కొత్త ఉత్సాహంతో కనిపిస్తారు. హీరో మానరిజం చూపించాలన్న, ఒక కొత్త లుక్ ఇవ్వాలన్న పూరి తరువాతే ఏవరైనా. పూరి ఏంలాటి హీరోనేనై చెక్కగా తీర్చిదిద్ధగలరు అనడంలో సందేహం లేదు.  అయితే హీరోలకు లుక్ అండ్ స్టైల్ ఇవ్వడం మాత్రమే మిగిలిందిప్పుడు పూరికి. రీసెంట్ గా పూరి తీసిన సినిమాల్లోనే పూరిని వెతుక్కునే పరస్థితి వచ్చింది ఆడియన్స్ కి.

 

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాధ్ కొత్త సినిమా రామ్ పోతినేని హీరోగా “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటివలే గోవాలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. గ్రాండ్ స్కేల్ లో సెట్లు వేసి హంగామా చేస్తున్నారు పూరి టీం. ఇందులో పాటలు శేఖర్ మాస్టర్ తదితరులు కోరియోగ్రఫీ చేస్తున్నారు. రామ్ మంచి డాన్సర్ కావడంతో ఉత్సాహమైన, విబిన్నమైన స్టెప్పులతో పాటలు ఉండబోతున్నాయని వినికిడి.

 

హీరో రామ్ కి కుడా సరైన హిట్టులు లేవు “హలో గురు ప్రేమకోసమే” అనే సినిమా యావరేజు టాక్ వచ్చింది. అంతకు ముందు చేసిన “ఉన్నది ఒక్కటే జిందగీ” సినిమాతో ఓ మోస్తరు హిట్ లభించినా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించలేదు. ఇంక ఈ హీరో ఒక బ్లాక్ బస్టర్ లాంటి హిట్ కోసం వేచిచుస్తున్నాడు. నిజానికి పూరి కూడా అదే తరహలో ఒక మంచి టర్నింగ్ పాయింటు కోసం చూస్తున్నాడు. తిరిగి తన స్టార్ డైరెక్టర్ రేంజ్ సంపాదించుకోవాలి అని తపన పడుతున్నాడు.

 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి ఆదరణ లభించి హీరో రామ్ చాల కొత్తగా కనపడుతున్నాడని ఆడియన్స్ టాక్. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానేర్స్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: