టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్ మూవీస్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది.   ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో జ్యోతిక నటించింది.  ఆమె గంగ పాత్రలో ప్రాణం పోసింది. మరో ముఖ్యపాత్రలో ప్రభు నటించారు.  ఇక రజినీకాంత్ సరసన హీరోయిన్ గా ప్రస్తుతం దక్షిణాధిన నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార నటించింది.  ఇది ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. 

విడుదలైన అన్ని భాషల్లోనూ విజయవిహారం చేసిన చిత్రాల జాబితాలో 'చంద్రముఖి' ఒకటిగా కనిపిస్తుంది. మలయాళంలో 'మణిచిత్రతాళు' పేరుతో తెరకెక్కిన సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 'మణిచిత్రతాళు' తమిళ భాషల్లో 'చంద్రముఖి' పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. కన్నడలో 'ఆప్తమిత్ర' పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. 

అక్షయ్ కుమార్ హీరోగా .. 'భూల్ భులయ్య' పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. అయితే చంద్రముఖి తెలుగు లో సీక్వెల్ చేయలేదు. త్వరలో 'భూల్ భులయ్య 2' సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: