ఒకప్పుడు హాలీవుడ్ లో ఫోర్న్ తారగా పాపులర్ అయిన సన్నీలియోన్ బాలీవుడ్ కి బిగ్ బాస్ ద్వారా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె గత జీవితానికి గుడ్ బాయ్ చెప్పింది.  తన ప్రియుడిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం ముగ్గురు పిల్లలను దత్త తీసుకుంది. 

సన్నీలియోన్ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ లో పలు ఐటమ్ సాంగ్స్ లో నటించింది.  నేడు సన్నీలియోన్ నిన్న తన 38వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 'డియర్ సన్నీలియోన్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతమైన రోజును గడిపావని భావిస్తున్నా.

ఈ ఏడాది మొత్తం సంతోషమయంగా ఉండాలని కోరుకుంటున్నా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే' అంటూ ట్వీట్ చేశాడు.  గతంలో కూడా షారూఖ్ ఖాన్ ఆమె విషయంలో వచ్చిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు..ఒక నటిగా ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు..గతాన్ని వెలికి తీయకుండా ఆమె నటిగా గుర్తించాలని ఫ్యాన్స్ ని కోరారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: