మహర్షి సినిమాలో మంచి పాత్ర పోషించిన అల్లరి నరేష్ కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి పేరొచ్చింది. ముఖ్యంగా గత కొంత కాలం నుండి సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ కమెడియన్ హీరోకి మహర్షి సినిమాలో మహేష్ బాబు పక్కన నటించే పాత్ర రావడంతో ప్రయోగాత్మకంగా అయినా అల్లరి నరేష్ ఒప్పుకొని సినిమా చేయడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు నా అల్లరి నరేష్ పేరు ఇండస్ట్రీ లో మారు మ్రోగిపోతోంది.

Image result for maharshi allari naresh

ఇదే క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ సమావేశాలలో పాల్గొన్న అల్లరి నరేష్ నాలుగేళ్ల తర్వాత హిట్ అనే మాట వింటున్నానని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. సక్సెస్ కోసం నరేష్ ఎంతగా తపించిపోతున్నాడో దాన్నిబట్టే అర్థమైపోయింది. దీంతో ఈ సినిమాలో తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేయడంతో మళ్లీ అల్లరి నరేష్ కి ఇండస్ట్రీ నుండి అనేక ఆఫర్లు వస్తున్నట్లు ఇండస్ట్రీలో తెగ వార్తలు వినబడుతున్నాయి.

Image result for maharshi allari naresh

గతంలో కమెడియన్ సినిమాలు చూస్తూ మినిమం బడ్జెట్ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గత కొంతకాలంగా చేసిన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మహర్షి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించడంతో ఇండస్ట్రీలో ఒక భారీ కమెడియన్ సినిమా ఆఫర్ అల్లరి నరేష్ కి వచ్చినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: