బాలక్రిష్ణ అంటే ఆ తీరే వేరు. ఆయన డైరెక్టర్ల హీరో అంటారు. కానీ కొన్నిసార్లు ఆయన చెప్పినట్లుగానే డైరెక్టర్ మాట వినాలి. అసలు బాలయ్య తనతో కనెక్ట్ అయ్యే డైరెక్టర్లతోనే మూవీస్ చేస్తారు. అవతల డైరెక్టర్ ఎంత పెద్ద వాడు అయినా తనతో కుదరకపోతే నో చెప్పేస్తారు. బాలయ్యకు బోయపాటికి మంచి అండర్ స్టాండింగ్  ఉంది.


అయితే ఇద్దరి మధ్యన  ఓ విషయం మీద విభేధాలు వచ్చాయి. అసలు నిజానికి బాలయ్య 105వ సినిమా బోయపాటితో చేయాలి. కానీ బడ్జెట్ 70 కోట్లకు తీసుకుపోవడంతో బాలయ్య నో చెప్పేశాడట. ముందు బడ్జెట్ తగ్గించు అంటూ షరతు పెట్టారట. ఇక బాలయ్యకు కూడా బోయపాటి మరో షరతు పెట్టారట.


బోయ‌పాటి సినిమాల్లో బాలయ్య డ్యూయల్  రోల్ ప్లే చేస్తారట. అందువల్ల యంగ్ లుక్ కి బాగా సన్నగా ఉండాలన్నది బోయపాటి కండిషన్. మొత్తానికి ఇద్దరు ఒకరికి ఒకరు కండిషన్లు పెట్టుకుని వెనక్కు వెళ్ళారు. ఈలోగా బాలయ్య కే ఎస్ రవికుమార్ తో మూవీ చేస్తున్నారు. ఇపుడు మళ్ళీ బోయపాటి వచ్చి 40 కోట్లతో మూవీకి రెడీ చేస్తున్నట్లుగా చెప్పాడట. అంటే తొందరలోనే బాలయ్య బోయపాటి మూవీ సెట్స్ మీదకు వస్తుందని అంటున్నారు. 2020 సమ్మర్ నాటికి ఈ కాంబో మూవీ వస్తుందని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: