సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి, కాలా, పేట, రోబో 2.ఓ సినిమాలు యావరేజ్ గా ఆడినప్పటికి ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోస్ తో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. యంగ్ హీరోసన్న ఒక సినిమా ఫ్లాప్ అయిదంటే నెక్స్ట్ సినిమా ఒప్పుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఒక్క యంగ్ హీరోలే కాదు స్టార్ హీరోలు సైతం ఫ్లాప్ పడితే మళ్ళీ హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవేవి లెక్క చేయకుండా రేసుగుర్రంలా పరిగెడుతున్నారు. 


ఇదే ఎనర్జీతో ప్రస్తుతం ఏ.ఆర్ మురగదాస్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీ కొత్త సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రజనీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న షెడ్యూల్ త్వరలో కంప్లీట్ అవనుందట. అంతేకాదు ఈ సినిమాకు "దర్బార్" అనే టైటిల్ ను కన్‌ఫర్మ్ చేస్తూ టైటిల్ లోగోను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ టైటిల్ లోగో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియోటర్లలోకి  వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ గత సినిమా ‘సర్కార్’మంచి విజయాన్ని సాధించి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: