టాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ ఏ ముహూర్తాన అడుగు పెట్టాడో గాని అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా చెప్పుకోద‌గ్గ హిట్ లేదు. జ‌య‌జాన‌కీ నాయ‌క లాంటి సినిమాలు క‌థా ప‌రంగా బాగున్నా ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కాలేదు. అల్లుడు శీను నుంచి బెల్లంకొండ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ఇక చివ‌ర‌గా వ‌చ్చిన క‌వ‌చం సినిమా కూడా సేమ్ టు సేమ్ రిజ‌ల్ట్‌.

తాజాగా బెల్లంకొండ శ్రీను  – కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో తెర‌కెక్కిన సీత ఈ నెల 24న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. బెల్లంకొండ‌కు ఒక్క హిట్ లేక‌పోయినా సీత‌కు ప్రి రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. సీత సినిమాకు రూ.21 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌గా... దీని వెన‌క హీరో శ్రీను కంటే నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు తేజ‌తో పాటు హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి.

ఏదేమైనా బెల్లంకొండ గ‌త సినిమా క‌వ‌చంలోనూ కాజ‌ల్‌, మెహ్రీన్ హీరోయిన్లుగా ఉండ‌డంతో ఆ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు ఉన్నా బాగానే బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు సీత‌కు కూడా కాజ‌ల్ బాగానే హెల్ఫ్ అయిన‌ట్లుంది. ఇక తేజ సీత‌ను ఎమోష‌న‌ల్ అండ్ యాక్ష‌న్ ట‌చ్ క‌థాంశంతో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. సోనూసూద్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: