రామ్ పోతినేని... హిట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు.   మొదటి సినిమా దేవదాస్ తోనే భారీ హిట్ అందుకున్న ఈ యువహీరో ఆ తరువాత కొన్ని మంచి చిత్రాలు చేశాడు.  గత కొంతకాలంగా ఈ హీరోను విజయాలు పలకరించడంలేదు.  విజయాలు ఎండమావల్లే దూరం అవుతున్నాయి.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పూరితో కలిసి ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నాడు.  


ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  పక్కా హైదరాబాద్ మాస్ యాక్షన్ తో సినిమాలో మెరుపులు మెరిపించబోతున్నాడు రామ్.  రామ్ ను అంతా ఎనర్జిటిక్ స్టార్ అంటారు.  ఫస్ట్ టేక్ నుంచి ఎన్ని టేక్స్ చేసినా అదే ఎనర్జీ.. ఎక్కడా ఆ ఫీల్ మిస్ కాదు.  అందుకే రామ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు.  పూరి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  


బొమ్మ హిట్ పడింది అంటే టాప్ లోకి వెళ్తుంది.  హీరోను ఎనర్జిటిక్ గా చూపించడంలో పూరీని మించిన దర్శకులు ఉండరు.  ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మ్యాజిక్ మ్యూజికల్ సినిమా ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి సంచనాలకు దారి తెరతీస్తుందో చూడాలి.  ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ శంకర్...టీజర్ ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.  


పేరుకు తగ్గట్టుగానే చాలా స్మార్ట్ గా ఉన్నాడు.  పక్కా లోకల్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు.  తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేయడంలో పూరి దిట్ట.  అలాంటి పూరి ఈ ఇస్మార్ట్ శంకర్ ను ఏం చేస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: