ఆర్‌ఎక్స్‌ 100 లాంటి యూత్‌ఫుల్‌ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన పాయ‌ల్ రాజ్‌ఫుత్‌కి ఆ సినిమాతో యూత్‌లో ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చింది. ఆ సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్‌కు త‌గ్గ‌ట్టుగా ఆమె రెచ్చిపోవ‌డంతో పాయ‌ల్‌కు యవ హీరోల సినిమాల్లో ఎక్క‌డా లేని ఆఫ‌ర్లు కోకొల్లుగా వ‌చ్చేస్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఆ సినిమా సూప‌ర్ హిట్ అయినా.... పాయ‌ల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టినా పాయ‌ల్ కెరీర్ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు.

అస‌లు యువ హీరోల ప‌క్క‌న ఛాన్సులు కాసేపు ప‌క్క‌న పెట్టేస్తే... ఓ మోస్త‌రు హీరోల ప‌క్క‌న కూడా ఛాన్సులు రాని ప‌రిస్థితి. కెరీర్ చాలా డ‌ల్‌గా ఉన్న టైంలో పాయ‌ల్‌కు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ స‌ర‌స‌న వెంకీ మామ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు బాబి. వెంకీ సీనియ‌ర్ హీరో. ఆయ‌న ప‌క్క‌న న‌టించేందుకు సీనియ‌ర్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, అనుష్క లాంటి వాళ్ల కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఎఫ్ 2 సినిమాలో ఏదో త‌మ‌న్నాతో బండి లాగించేశారు. ఇప్పుడు ఆరు ప‌దుల వ‌య‌స్సుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న వెంకీ ప‌క్క న‌టించాల‌న్నా పాయ‌ల్‌కు ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఒప్పుకోక త‌ప్ప‌లేదు.

ఇక మ‌రో ఓల్డేజ్ సీనియ‌ర్ నాగార్జున మ‌న్మ‌థుడు 2 సినిమాలో ఆమెకు ఛాన్స్ వ‌చ్చింది. చివ‌ర్లో స‌డెన్‌గా ర‌కుల్‌ప్రీత్‌సింగ్ డేట్లు ఇవ్వ‌డంతో పాయ‌ల్‌ను ప‌క్క‌న పెట్టారు. ఇక మ‌రో ఫిఫ్లీ ప్ల‌స్ హీరో రవితేజ డిస్కోరాజాలో కూడా పాయ‌ల్ చేస్తోంది. వీళ్లంతా వ‌య‌స్సు పైబ‌డిన వారే. అస‌లే ముస‌లి హీరోల‌కే పాయ‌ల్ ప‌రిమిత‌మ‌వుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ హీరో స‌ర‌స‌న ఆమెకు ఛాన్స్ వ‌చ్చింది. అస‌లు ఛాన్సులు లేక‌పోవ‌డం క‌న్నా ఏదో ఒక‌టి బెట‌ర్ అన్న‌ట్టుగా దానిని కూడా ఆమె ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ట‌. 

బాలకృష్ణతో కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ రూల‌ర్‌)లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో మరో హీరోయిన్‌ కూడా వుంటుంది కానీ ఒక హీరోయిన్‌ రోల్‌ అయితే పాయల్‌కి బుక్‌ అయింది. సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా న‌టించ‌డం స్టార్ట్ చేస్తే ఇక కుర్ర హీరోలు అవ‌కాశం ఇచ్చేందుకు ఒప్పుకోర‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో ఉంది. ఇప్పుడు సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు కూడా వ‌దులుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని పాయ‌ల్ ఇలా రాజీప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: