‘ఆర్ ఎక్స్ 100’ ఊహించని ఘన విజయం సాధించిన తరువాత ఆమూవీలో నటించిన పాయల్ రాజ్ పుత్ కు టాప్ యంగ్ హీరోల నుండి క్రేజీ ఆఫర్లు వస్తాయని చాలామంది భావించారు. అయితే ఆమెకు టాప్ యంగ్ హీరోల నుండి కాకుండా టాప్ సీనియర్ హీరోల నుండి వరసపెట్టి అవకాశాలు వస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈమె రవితేజాతో ‘డిస్కోరాజ’ వెంకటేష్ తో ‘వెంకీ మామ’ సినిమాలలో నటిస్తోంది. ఇలా ఆమె సీనియర్ హీరోల పక్కన నటిస్తున్నందుకు ఆమెకు కోటిన్నరకు పైగా పారితోషికం ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఇప్పుడు బాలకృష్ణతో రోమాన్స్ చేయబోతు ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈనెల ప్రారంభం కాబోతున్న బాలకృష్ణ కెఎస్ రవికుమార్ ల మూవీ ప్రాజెక్ట్ లో పాయల్ హీరోయిన్ గా నటించడానికి తన అంగీకారం చెప్పడమే కాకుండా ఈసినిమాకు కూడ ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చాలాకాలం తరువాత బాలయ్య మళ్ళీ పోలీసు డ్రెస్ వేసుకుంటున్న ఈమూవీ బాలయ్యకు బాగా అచ్చివచ్చిన రాయలసీమ నేపధ్యంలో ఉంటుంది అని టాక్. 

‘రూలర్’ పేరుతో నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో పాయల్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించడమే కాకుండా బాలయ్యతో ఈమె చేయబోయే రొమాంటిక్ సీన్స్ ఈమూవీకి హైలెట్ గా మారుతాయి అని అంటున్నారు. ఈమూవీ ప్రారంభించిన వెంటనే వేగంగా ఆరు నెలలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో బాలయ్యకు అచ్చొచ్చే సంక్రాంతి రోజున విడుదల చేయాలని ఈమూవీ నిర్మాతల ప్లాన్ అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: