మెగా హీరో వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ పెంచినట్టుగా తెలుస్తుంది. ఫిదా ముందు వరకు మెగా హీరోగా వరుస అవకాశాలు అందుకున్నా ఆ సినిమా హిట్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. అతంకు ముందు వరకు 2 కోట్లు డిమాండ్ చేసే వరుణ్ తేజ్ ఆ తర్వాత 4 కోట్లకు చేరాడు. ఇక రీసెంట్ గా ఎఫ్-2 తో 100 కోట్ల క్లబ్ లో చేరాక మనోడి రేంజ్ మరింత పెరిగింది.


ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో వాల్మీకి సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత కిరణ్ డైరక్షన్ లో బాక్సింగ్ నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు గాను రెమ్యునరేషన్ గా ఆరున్నర కోట్లు అడుగుతున్నాడట వరుణ్ తేజ్. ప్రతి సినిమా కొత్తదనంతో చేస్తున్న వరుణ్ తేజ్ పెరిగిన రెమ్యునరేషన్ నిర్మాతలకు షాక్ ఇస్తుంది.


అయితే మెగా హీరోగా వరుణ్ తేజ్ కు డిమాండ్ బాగానే ఉంది. ఎఫ్-2 తర్వాత వరుణ్ తేజ్ క్రేజ్ కూడా పెరిగింది. వాల్మీకి, బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న రెండు సినిమాలు పూర్తి చేశాక మళ్లీ ఎఫ్-3 సినిమా కోసం పనిచేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. వెంకటేష్ కూడా ఎఫ్-3 కు ఓకే చెప్పినట్టు టాక్.


మొత్తానికి ఓ మల్టీస్టారర్ సినిమా మళ్లీ వరుణ్ ను ట్రాక్ ఎక్కించగా ఈసారి ఈ మెగా హీరో మంచి ఫాం కొనసాగించేలా కనిపిస్తున్నాడు. మెగా హీరోల్లో మిగతా వారంతా వెనుకపడగా వరుణ్ తేజ్ మాత్రం తన కెరియర్ ను చక్కగా ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తుండటంతో వరుణ్ తేజ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: