వెండి తెరపై నవ్వుల సందడి చేసిన వాళ్ళలో బాబూ మోహన్, కోట శ్రీనివాస రావు కాంబినేషన్ ఎంతో ప్రత్యేకం. సినిమాలలో వీరి కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్స్ సందర్భానుసారంగా వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. అందుకు ఉదాహరణ మాకాంబినేషన్‌లో వచ్చిన మామగారు, చినరాయుడు వంటి సినిమాలు. కమెడియన్స్‌గా మా ఇమేజే వేరు అన్నారు. ఇక రీసెంట్‌గా ఒక సందర్భంలో కమెడియన్ బాబు మోహన్ మాట్లాడుతూ కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.


కోట శ్రీనివాసరావు, నేను ఫిల్మ్ నగర్లో పక్కపక్కనే ఇళ్లు కట్టుకున్న దగ్గర నుంచి, అన్నదమ్ములగానే ఉంటున్నాము. కోట కుటుంబ సభ్యులంతా .. ఆ కుటుంబంలో ఒకడిగానే నన్ను చూసుకుంటారు. ఇప్పుడు మేము ఒక తల్లి పిల్లల్లా ఉంటాము. అయితే స్టార్ కమెడియన్స్‌గా ఎన్నో లక్షల మందిని నవ్వించిన మా ఇద్దరికీ 'విధి' ఒకే రకమైన శిక్ష వేసింది.


కోట వారి అబ్బాయి .. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. కోట కొడుకు ముందు బైక్ పై వెళుతుంటే .. వెనుక కార్లో భార్యాపిల్లలు వస్తున్నారు. వాళ్లు చూస్తుండగానే ఆ అబ్బాయికి ప్రమాదం జరిగింది. అలాగే మా పెద్దబ్బాయి బైక్ పై వస్తుంటే .. మా చిన్నబాబు వెనుక కార్లో వున్నాడు. చిన్నవాడు చూస్తుండగానే పెద్దాడికి ప్రమాదం జరిగింది" అంటూ ఏది ఏమైనా మా ఇద్దరి పిల్లల చావుకు, మా బాధకి భగవంతుడే కారణం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: