హీరోయిన్‌తో హీరో రొమాన్స్ చేయడం చాలా రొటీన్.. కానీ హీరోయిన్ తో కమెడియన్ రోమాన్స్ చేస్తే.. ఏదో ఒక అల్లరి సీన్ కాదు... ఏకంగా రెయిన్ సాంగ్ వేసుకుంటే.. ఎలా ఉంటుంది.. అందుకు సమాధానమే ఈ ఇండస్ట్రీ హిట్ సాంగ్.. ఆ పాటే.. చినుకు చినుకు అందెలతో.. చిటపట చిరు సవ్వడితో.. 


మాయలోడు సినిమాలో ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా హిట్ అయ్యిందా పాట. ఈ పాట ద్వారా అప్పటివరకూ తన్నులు తినే కామెడి పాత్రలు వేసిన బాబు మోహన్ కూడా ఏకంగా హీరో అయ్యాడు. ఈ సినిమా తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశాడు. 

మరి అసలు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది. ఈ విషయం ఓ ఇంటర్వూలో చెప్పారు బాబుమోహన్. ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా వచ్చేశాక ఈ పాట అనుకున్నారట. అప్పుడు మద్రాసులో ఉన్న బాబూమోహన్‌ ను అర్జంటుగా పిలిపించి సాంగ్ షూట్ చేశారట. ముందు ఈ మాట చెప్పినప్పడు బాబూ మోహన్ షాక్ అయ్యాడట. 

మరేం పర్లేదు నువ్వు చేస్తావని కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారట. నిజానికి ఆ పాట రాజేంద్రప్రసాద్ గారు చేయవలసిందట .. కానీ అక్కడ ఏదో జరిగిందట ..మొత్తానికి హీరోయిన్ సౌందర్య పక్కన ఈ పాటలో బాబూ మోహన్ అదరగొట్టేశాడు. షూటింగ్‌లో కూడా బాబూ మోహన్ లైఫ్‌లో ఫస్టు సాంగ్ అయినా అన్ని షాట్లూ వెంటనే ఓకే అయ్యాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: