ఇప్పుడంటే హీరోయిన్లగా కాలేజీ అమ్మాయిలు కూడా కలలు కంటున్నారు కానీ.. సినిమాలు వచ్చిన కొత్తల్లో అమ్మాయిలను ఆ రంగంవైపు పంపాలంటేనే తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. ఎంత పద్దతిగా ఉండే ఆడవాళ్లయినా సినీరంగంలోకి వెళ్తే చెడిపోతారని అనుకునేవారు.

షావుకారు జానకి కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పటి నుంచి తనకు తెలియకుండానే నటన పట్ల ఆసక్తి ఉండేది. 15 ఏళ్ల వయసులోనే రేడియో నాటకాలు వేస్తుండేదట. రేడియోలో ఆమె వాయిస్ విన్న బి.ఎన్. రెడ్డిగారు రేడియో స్టేషన్ డైరెక్టర్ కి ఫోన్ చేసి వాకబు చేశారట.

 స్టేషన్ డైరెక్టర్ అనుమతిని తీసుకుని వచ్చి ఆయన జానకిని కలుసుకున్నారు. 'సినిమాల్లో చేస్తావా?' అని ఆయన అడిగితే, జానకి ఎగిరిగంతేసింది. ఇంటికి వచ్చి ఆ విషయం అమ్మానాన్నలకి చెప్పగానే, చకచకా సంబంధం చూసేసి పెళ్లి చేసేశారట. కానీ పెళ్లి తర్వాత కూడా జానకికి అవకాశాలొచ్చాయి. 

సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఎన్నార్‌తో ఓ శోభనం సీన్ చేయాల్సి వచ్చిందట. పాండవులు.. పాండువులు.. తుమ్మెద.. పాటే ఆ శోభనం పాట. ఆ పాట చేసిన తర్వాత చుట్టాలు, పక్కాలు ఆమెను వింతగా చూసేవారట. తమ ఇళ్లలో శుభకార్యాలకు పిలిచేవారు కాదట. అలా ఉండేది ఆరోజుల్లో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: