విశాఖ బీచ్‌ రోడ్డులో చాలామంది ప్రముఖుల విగ్రహాలు ఉంటాయి. వాటిలో ఇటీవల ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలపై  తాజాగా వివాదం నెలకొంది. అవి అక్కడ ఉండటం నిబంధనలకు విరుద్దమంటూ అధికారులు తొలగించారు. 


అయితే ఈ తొలగింపు వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయట. ఆ విషయాన్ని  రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ బయటపెట్టారు. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, దాసరి కుమారుడు అరుణ్, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని సహించలేకే చంద్రబాబు ఇలా చేశారంటున్నారు ఆయన. 

విశాఖ బీచ్ రోడ్‌లో దాసరి, అక్కినేని, హరికృష్ణల విగ్రహాలు ఏర్పాటు చేయించింది ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాదే. యార్లగడ్డ గతంలోనూ కొన్ని చంద్రబాబుకు కోపం తెప్పించే కామెంట్లు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందన్నారు. ఆ మాటలతో చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. 

అందుకే  తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను చంద్రబాబు తొలగింపేజేశారని యార్లగడ్డ మండిపడ్డారు. బీచ్ రోడ్డులో మరెందరివో విగ్రహాలున్నాయని వాటిని వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేతలు ఎందుకు కోర్టులో కేసు వేశారని ఆయన ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా విగ్రహాలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: