టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కి బాక్సాఫీస్ దగ్గర మంచి చరిత్ర ఉంది. గతంలో వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి చిరంజీవితో ఠాగూర్ అదేవిధంగా ఖైదీ నెంబర్ 150 వంటి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమాలు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాయి .

Image result for vv vinayak shriya saran

అయితే గత కొంత కాలంగా  సరైన హిట్లు లేక సతమతమవుతున్న వినాయక్ ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అయిన వెంటనే వినాయక్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇలా ఉండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వినాయక్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.

Image result for vv vinayak shriya saran

అసలు విషయంలోకి వెళితే ఇటీవల దిల్ రాజు దగ్గరికి ఒక మధ్య వయసుకు చెందిన వ్యక్తి యొక్క కథతో కూడిన సినిమా తన దగ్గరికి వచ్చిందట...దీంతో ఆ సినిమా స్టోరీ వింటున్న దిల్ రాజు కి ఆ మధ్య వయస్సు వ్యక్తి పాత్రలో  వినాయక్ సరిగ్గా సరిపోతాడని వినాయక్ బాడీ లాంగ్వేజ్ కి మరియు ఆ పాత్రకి సరిగ్గా సూట్ అయిపోతారని ...ఆ పాత్రలో వినాయక్ ని నటింపజేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వివి వినాయక్ పక్కన హీరోయిన్ గా శ్రేయ ని ఎంపిక చేయడానికి కూడా దిల్ రాజు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: