టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే చెవి కోసుకొంటారు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల లో క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టపడతారు అందుకునే దేశానికి సంబంధించిన మ్యాచులు ఎక్కడ జరిగిన కుదిరితే తనకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా మైదానంలో కూర్చుని ఇండియన్ క్రికెట్ టీమ్ ని సపోర్ట్ చేస్తారు. అంతే కాకుండా ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ లలో సైతం వెంకటేష్ హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి.

Image result for mahesh venkatesh

ఇదే క్రమంలో ఈ సమ్మర్ కి మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు..తనకి ఈ సినిమా 2011 వరల్డ్ కప్ లో లాస్ట్ సిక్స్ ధోని కొట్టిన దానితో సమానం అంటూ అప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో…’మహర్షి’  సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ స్థాయిలోనే ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఇటీవల సక్సెస్ మీట్ లో మహేష్ తెలపడం జరిగింది. అంతేకాకుండా క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని అప్పట్లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కోసం బొంబాయి వెళ్లి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య కూర్చుని మ్యాచ్ను ఆస్వాదించడం జరిగింది అంటూ క్రికెట్ పై తన ప్రేమను ఇటీవల తెలియజేశారు మహేష్.

Image result for mahesh venkatesh

ఇదిలావుండగా త్వరలో యుకెలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కోసం ఇండియా మ్యాచులు చూసేందుకు మహేష్ బాబు వెంకటేష్ కలిసి వెళ్లనున్నట్టు సమాచారం. నిర్మాత సురేష్ బాబు కూడా ఈ బృందంలో ఉంటారట. ఇండియా ఆడే లీగ్ మ్యాచులు చూసి సెమీస్ చేరితే కనక టూరును కొనసాగిస్తారు. దానికి అనుగుణంగా వెంకటేష్ తన వెంకీ మామ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారట. మరో పక్క మహేష్  మహర్షి సినిమా హిట్టవడంతో రిలాక్స్ అయ్యే కామంలో అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేయడానికి కొంత సమయం తీసుకుంటున్న నేపథ్యంలో వరల్డ్ కప్ టూర్ షెడ్యూల్ వేసుకున్నారట. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో పెద్దోడు చిన్నోడు కలిసి యూకే వెళ్లి ఇండియాకి వరల్డ్ కప్ సాధించబోతున్నారన్నమాట అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: