కథ, కథనాలు, నటీనటులు, దర్శకత్వ ప్రతిభ అన్ని తోడైతేనే సినిమా హిట్ అవుతుంది.  సక్సెస్ సాధించిన దర్శకుడు తన లైఫ్ లో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తాడో తెలియదుగాని, ఒక్కసారి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన హీరోయిన్... వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.  టాప్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి.  కాజల్ చాలా తెలివైన అమ్మాయి.. సినిమా విషయంలో తీసుకునే డెసిషన్ పాజిటివ్ గా ఉంటుంది.  


కాజల్ అగర్వాల్ ను దర్శకుడు తేజ ఇండస్ట్రీకి లక్ష్మీకళ్యాణం సినిమా ద్వారా పరిచయం చేశాడు.  అందమైన రూపం, పెద్దవైన కళ్ళు ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు మొదటి సినిమా హిట్ కావడంతో... కాజల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసింది.  తనకు అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకునే సమయంలో తన టాలెంట్ తో అవకాశాలు తెచ్చుకుంది.  తనకు మొదటి సినిమాతో మంచి లైఫ్ ఇచ్చిన తేజాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసింది.  నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఒప్పుకుందట కాజల్.  ఈ విషయాన్ని తేజ స్వయంగా చెప్పడం విశేషం.  


నేనే రాజు నేనే మంత్రి సినిమా కంటే ముందు తేజాకు మంచి హిట్ లేదు.  అయినా సరే కలిసి కథ చెప్పిన తరువాత సినిమా చేసేందుకు ఒకే చెప్పిందట కాజల్.  అలా సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు సీత సినిమాలో నటించేందుకు మరోసారి ఒకే చేసిందని తేజ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  సీత సినిమాలో ఆమెది ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అని, అందరికి తప్పకుండా నచ్చుతుందని అంటున్నాడు తేజ.  మే 24 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: