టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు. బోయపాటి బాలకృష్ణతో సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటే బాలయ్య బోయపాటి వైపు చూడటం లేదు. అయితే బోయపాటితో సినిమా చేయాలని ఉంది అంటూ హీరో నితిన్ సంకేతాలు పంపుతుంటే బోయపాటి స్పందించడం లేదు అని టాక్. 

ఇలాంటి పరిస్థుతులలో తాను కోరుకున్న టాప్ హీరోలు దొరకక బోయపాటితో సినిమాలు చేస్తాము అంటూ సంకేతాలు పంపుతున్న మిడిల్ రేంజ్ హీరోల వైపు చూడలేక ఒక విచిత్రమైన పరిస్థితిలో బోయపాటి ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ కెఎస్ రవి కుమార్ సినిమా తరువాత బోయపాటి సినిమా మొదలు పెడతాడ లేదా అన్న విషయమై తన మనసులో మాట బయటపెట్టకుండా బోయపాటిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్.

ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉండగా నితిన్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సహకారంతో బోయపాటితో సినిమా చేయడానికి రాయబారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ‘లై’ ‘ఛల్ మోహన్ రంగా’ ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి మూడు ఫ్లాపుల్లో నటించిన తరువాత ఆత్మ విశ్వాసం కోల్పోయిన నితిన్ గత 10 నెలలుగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నాడు. గత ఏడాది నితిన్ ఒప్పుకున్న వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ‘భీష్మ’ ఇంకా ప్రారంభం కాలేదు. 

దీనికితోడు  సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో నితిన్ నటించవలసిన సినిమా క్యాన్సిల్ అయింది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ పరిస్థుతుల నుండి గట్టెక్కాలి అంటే నితిన్ తనకు ఒక పెద్ద దర్శకుడు సపోర్ట్ కావాలి అని ఆలోచనలు చేస్తునట్లు టాక్. దీనితో ఏదోవిధంగా బోయపాటి కోరుకునే భారీ పారితోషికం ఇప్పించి బోయపాటితో సినిమా చేయాలని నితిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే బోయపాటి మాత్రం నితిన్ రాయబారాలకు స్పందించకుండా బాలయ్య వంక ఇంకా ఆశగా చూస్తున్నట్లు టాక్. దీనితో బోయపాటి విచిత్ర పరిస్థితి పై ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: