యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 5 న రిలీజ్ చేయనున్నారని లేటెస్ట్ న్యూస్.


సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ జూలై 5 అయితే రిలీజ్ కు అన్ని విధాల సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒకటి యువకుడిగా ఉండే పాత్ర అయితే మరో షేడ్ మాత్రం మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడట.  ఈ పాత్ర కోసం శర్వా గడ్డం పెంచి ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.  ఈ సినిమాలో శర్వా గ్యాంగ్ స్టర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. 
 
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా శర్వా గెటప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్‌గా శర్వా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'పడి పడి లేచే మనసు' డిజాస్టర్ అవడంతో ఎలాగైనా ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని ఉన్నాడట శర్వానంద్. 


మరింత సమాచారం తెలుసుకోండి: