‘మహర్షి’ ప్రభావంతో ఇప్పుడు యూత్ లో రైతుల కష్టాల పై అదేవిధంగా వారి కన్నీటి వ్యధల పై అవగాహన ఏర్పడింది. అంతేకాదు ఈమూవీ ప్రభావంతో కొందరు ఉద్యోగులు వీకెండ్స్ లో పల్లెటూళ్ళు వెళ్ళి అక్కడ పొలాల బాట పట్టి రైతుకు గౌరవంతో కూడిన భరోసాను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

అదేవిధంగా సోషల్ మీడియాలో తాము నాగలి పట్టుకుని పొలం దున్నుతున్నట్లు రైతులతో కలిసి వ్యవసాపనులు చేస్తున్నట్లు ఫోటోలను కూడ చాలామంది మహేష్ అభిమానులు షేర్ చేస్తున్నారు. నడుస్తున్న ఈ వ్యవహారం పై కోలీవుడ్ హీరో విశాల్ అభిమానులు మాత్రం ఘాటైన సెటైర్లు వేసారు.

రైతుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే ఏకైక హీరో విశాల్ మాత్రమే అంటూ ఒక ఆసక్తికర కామెంట్స్ అతడి అభిమానులు షేర్ చేసారు. విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయోగ్య’ మూవీకి వస్తున్న భారీ కలక్షన్స్ లో ఆసినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు చెల్లించే టిక్కెట్ ధర నుండి ఒక రూపాయి చొప్పున విశాల్ తమిళనాడులోని రైతుల సహాయ నిధికి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ‘మహర్షి’ పై విశాల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

‘మహర్షి’ సినిమా నాలుగు రోజులలో 100 కోట్లు వసూలు చేసిందని గొప్పలు చెపుతూ హడావిడి చేస్తున్న మహేష్ అభిమానులు ‘మహర్షి’ కలక్షన్స్ లో ఎంత మొత్తం తమ హీరో విశాల్ లా రైతులకు ఇచ్చారో చెప్పాలని కామెంట్స్ చేసారు. అంతేకాదు మహేష్ కేవలం మాటల ‘మహర్షి’ మాత్రమే అనీ కానీ విశాల్ మాత్రం రియల్ మహర్షి అంటూ వేస్తున్న సెటైర్లు మహేష్ ను ఆలోచింప చేసి ‘మహర్షి’ కలక్షన్స్ నుండి ఏమైనా తెలుగు రాష్ట్రాలలోని రైతులకు సహాయపడేలా ఏమైనా చేస్తాడేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: