సినిమాలకు పబ్లిసిటియే ప్రాణం. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ లేకుంటే రికార్డుల కలక్షన్స్ రావు. అయితే ఈవిషయాలు అన్నీ వాస్తవాలే అయినా మహేష్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుని వ్యూహాత్మక తప్పులు చేస్తున్నాడా అన్నసందేహాలు అతడి అభిమానులలో కూడ ఏర్పడటం షాకింగ్ గా మారింది. 

ప్రస్తుతం మీడియా చాల చైతన్యవంతంగా మారిన నేపధ్యంలో ఏఒక్క చిన్న పొరపాటు జరిగినా ఆపొరపాటును పదేపదే హైలెట్ చేస్తూ మీడియా కథనాలు కామెంట్స్ ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ట్రెండ్ మరీ విపరీత స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థుతులలో నిన్న ‘మహర్షి’ కి సంబంధించి విడుదల చేయబడ్డ ఒక పోస్టర్ పై విపరీతమైన రగడ జరుగుతోంది. 

‘మహర్షి’ థియేట్రికల్ రన్ వారం పూర్తి అయిన సందర్భంలో ఈపోస్టర్ ను చేసి ‘మహర్షి’ మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా ‘మహర్షి’ నిలిచిందని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయమై ‘మహర్షి’ పై సెటైర్లు పడేలా చేస్తోంది. మహేష్ ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ సినిమాతో నాన్ ‘బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ చిత్రం 85 కోట్లకు పైగా షేర్ సాధించింది. గతఏడాది మహేష్ నుంచి వచ్చిన ‘భరత్ అనే నేను’ 92 కోట్ల షేర్ సాధించి మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 

అయితే ఇప్పుడు ‘మహర్షి’ తొలి వారంలో 75 కోట్ల షేర్ మాత్రమే రాబట్టితే అది మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఎలా అవుతుంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ‘మహర్షి’ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా ఎలా మారుతుంది అంటూ కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. దీనితో మహేష్ అత్యుత్సాహంతో తనకు తానే తన కెరియర్ లో మైలురాళ్లుగా నిలిచిన ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ సినిమాలను తగ్గించుకుని ‘మహర్షి’ ని ఆకాశంలోకి ఎత్తేస్తున్నాడా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈకామెంట్స్ ఇలా వస్తున్న నేపధ్యంలో కలక్షన్స్ ఫిగర్స్ లేకుండా ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పోస్టర్లు వదలడం అభిమానుల ముందు మహేష్ కాలర్ ఎగరవేయడం ఇవన్నీ మహేష్ టెన్షన్ సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: