టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంటక నరసింహా రావు కొద్ది గంటల క్రితం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు మోతీనగర్ లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్స్ చేత చికిత్స పొందుతున్న సమయంలోనే రాళ్లపల్లి అనంతలోకాలకు వెళ్లారు. 


చిన్ననాటి నుండి నాటకాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన రాళ్లపల్లి.  1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సిని రంగ ప్రవేశం చేశారు. తెలుగులో దాదాపుగా 850 పైగా సినిమాల్లో నటించారు రాళ్లపల్లి. శుభలేఖ, ఖైది, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ చివరగా భలే భలే మగాడివోయ్ సినిమాలో నటించారు రాళ్లపల్లి.


తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ హాస్యనటులలో రాళ్లపల్లి ఒకరు. తెలుగు పరిశ్రమకు దాదాపు 3 దశాబ్ధాలకు పైగా సేవలను అందించారు. రాళ్లపల్లి 1955 అక్టోబర్ 10న ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. కేవలం కామెడీ పాత్రలే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. 


రాళ్లపల్లి మరణ వార్త సిని పరిశ్రమ కూడా షాక్ అయ్యింది. ఈమధ్యనే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల సందర్భంగా మీడియాకు కనిపించారు రాళ్లపల్లి. ఆ టైంలో చిరంజీవి, నాగార్జులతో ఆయన ముచ్చటించారు. అనారోగ్య సమస్య వల్లే రాళ్లపల్లి మరణించినట్టు తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: