ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్ గా, నటుడుగానూ, టీవీ వ్యాఖ్యాత, నిర్మాత తనకంటూ స్థానాన్ని ఏర్పర్చున్న వ్యక్తి కపిల్ శర్మ. జూన్ 2013 నుంచి జనవరి 2016 వరకు భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆయన. 2013లో ఫోర్బ్స్ సంస్థ భారతీయ సెలబ్రటీ జాబితాలో 93వ వ్యక్తిగా పేర్కొంది.


2013లో ఎంటర్టైన్మెంట్ క్యాటగిరీలో సి.ఎన్.ఎన్-ఐబిఎన్ కపిల్ ను ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ది ఎకనమిక్ టైమ్స్ 2015లో మోస్ట్ ఎడ్మైర్డ్ ఇండియన్ పర్సనాలిటీ జాబితాలో 3వ ర్యాంకు ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్రమోడి కపిల్ ను స్వచ్ఛ  భారత్ అభియాన్ కు ఎంపిక చేశారు. సెప్టెంబరు 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కపిల్ ను రాష్ట్రపతి భవన్ కు పిలిచి స్వచ్ఛ్ భారత్  అభియాన్ గురించి వివరించారు. 2015 సెప్టెంబరు 25న విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు కపిల్. ఇప్పుడు కపిల్ ను అరుదైన గౌరవం దక్కింది. 


ఇప్పుడు బాలీవుడ్‌ హాస్య నటుడు కపిల్‌ శర్మకు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఎక్కువ మంది ఫాలోయింగ్‌, ప్రేక్షకులను సంపాదించుకున్న స్టాండప్‌ కమెడియన్‌గా ఆయన ఘనత సాధించారు. ఇందుకు గానూ ‘వరల్డ్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌’ లో చోటు దక్కింది. సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు, పంచ్‌లకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. దీంతో పాటు ఆయన ‘ది కపిల్‌ శర్మ షో’ పేరుతో ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగానూ వ్యవహిరిస్తున్నారు. ఈ షో విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇండియాతో పాటు ఆయనకు విదేశాల్లోనూ అభిమానులున్నారు. కపిల్‌ను అభిమానులు ముద్దుగా ‘కామెడీ కింగ్‌’ అని, ‘కామెడీ సూపర్‌స్టార్‌’ అని పిలుచుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: