తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస  సినిమాలతో బిజీగా ఉన్న హిరోయిన్ సమంత. ఏమాయ చేసేవే సినిమాతో నాగచైతన్య సరసన టాలీవుడ్లో అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ చివరకు అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్య జీవితం ఇప్పుడు ప్రశాంతంగా సాగుతోంది. నాగుర్జన కోడలిగా, నాగచైతన్య భార్య సమంత ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎందరో స్టార్ హిరోలతో కథానాయికగా నటించి ప్రశంసలను మూటగట్టుకుంది.


ఇప్పుడు సమంతకు తన తల్లితో మనస్పర్థలా? ఇలాంటి ప్రచారమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సమంత చెన్నై చిన్నదన్నవిషయం తెలిసిందే. తన భర్త కలిసి మజిలీ సినిమా చేయడం సమంతకు ఆనందకరమైన విషయం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ వసూళ్లను సైతం సొంతం చేసుకుంది. ఇకపోతే హీరోయిన్ల గురించి ఏదో ఒక ప్రచారం జరగడం సర్వసాధారణం.


అదేవిధంగా ఇప్పుడు నటి సమంత గురించి ఒక  వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సమంతకు తన తల్లికి మధ్య మనస్పర్థలు తలెత్తాయన్నదే ఆ ప్రచారం. సాధారణంగా వదంతుల గురించి పెద్దగా స్పందించని సమంత ఈ విషయంలో మాత్రం వేగంగా స్పందించింది. ఎంతైనా అమ్మ కదా.. ఇలాంటి వదంతులకు అడ్డుకట్ట వేయకపోతే ఎన్నో వదంతులను అడ్డుకోవాల్సి వస్తుందని భావించిందో ఏమో. తల్లితో తన అనుబంధం గురించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సమంత పేర్కొంటూ తన తల్లి ప్రార్థనలో మ్యాజిక్‌ ఉందని తాను నమ్మానని, ఇప్పటికీ నమ్మతున్నానని అంది.


చిన్నతనంలో లానే ఇప్పటికీ తనకోసం ప్రార్థన చేయమని అమ్మను కోరతానని చెప్పింది. అమ్మ ప్రార్థన చేస్తే అంతా సరి అయిపోతుందని తెలిపింది. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే అమ్మ తన కోసం ఎప్పుడూ ప్రార్థన చేసుకోలేదని చెప్పింది. దైవం స్థానంలో ఉండేది అమ్మేనని సమంత పేర్కొంది. దీంతో పాటు సమంత తన తల్లి ఫొటోనూ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్‌ చేసి తన ప్రేమను మరోసారి చాటు కోవడంతో పాటు, వదంతులు ప్రచారం చేసేవారికి తగన బదులు ఇచ్చింది. దటీజ్‌ సమంత. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: