నీతులు చెప్పడం కాదు..అవి ఆచరణలో చూపిస్తేనే నిజమని నమ్ముతారు ఎవరైనా.  నోరుంది కదా అని ఎక్కడ బడితే అక్కడ లెక్చర్లు ఇవ్వడం చాలా మంది కామన్ అయ్యింది.  ఇక సినిమాల విషయమైతే ఇది కాసింత ఎక్కువే అని చెప్పొచ్చు.   ఎందుకంటే ఈ మద్య వస్తున్న సినిమాల్లో ఎక్కువగా రైతు సమస్యలపై వస్తున్నవే.  ఆ మద్య శ్రీమంతుడు సినిమాతో ఊరిని దత్తత తీసుకుకొని బాగు చేయాలని మెసేజ్ వచ్చింది..దాంతో కొంత మంది ఊర్లను దత్త తీసుకున్నారు..కానీ ఎక్కువ సమయం పట్టలేదు దాన్ని మర్చిపోవడానికి. 

ఈ మద్య మహర్షి సినిమాతో  రైతు సమస్యల మీద మహేష్ బాబు రీసెంట్ గా మహర్షి సినిమా తీసి హిట్ కొట్టారు. అందులో రైతుల కోసం తన ఆస్తిలో చాలా భాగం మహేష్ రాసేసినట్లు చూపెట్టారు. ఆ పని చేసినందుకు థియేటర్లో విపరీతంగా చప్పట్లు కొట్టారు..బయటకు వచ్చిన తర్వాత అంతా షరా మామూలే. తాజాగా మహేష్ సినిమా చూసి చాలా మంది సెలబ్రెటీలు ఆహా..ఓహో అన్నారు..కానీ తమిళ హీరో విశాల్ మాత్రం ఖండించారు. రైతుల గురించి చెప్పడం కాదు..చేసి చూపించాలి.. దానికి కారణం రైతుల కోసం విశాల్ ఉదారత చూపటమే. 

 పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమా ని ‘అయోగ్యా’ పేరుతో హీరో విశాల్ తమిళ్‌లో రీమేక్ చేసాడు. ఈ సినిమాకు కొనుగోలు చేసిన టికెట్‌ ధర నుంచి ఒక రూపాయిని రైతులకు ఇస్తున్నట్లు విశాల్ ప్రకటించాడు. గతంలో విశాల్ నటించిన పందెం కోడి, అభిమన్యుడు తదితర చిత్రాలకు కూడా విశాల్ ఇలాగే రైతులకు విరాళం ఇచ్చాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. శామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిది.


మరింత సమాచారం తెలుసుకోండి: