ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వలంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు.
అయితే మెగాస్టార్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు విలన్ గా నటిస్తున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ట్విస్ట్ ఏంటేంటే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నటిస్తున్నది మెగాస్టార్ చిరుతో కాదు.. మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ తో అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు సిద్ధిఖి డైరెక్షన్స్ లో మోహన్ లాల్ హీరోగా బిగ్ బ్రదర్ అనే సినిమా తెరకెక్కనుంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.
కుదిరితే అక్టోబర్ లోనే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మలయాళంలో నా తొలి చిత్రం. చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను అని అర్భాజ్ తన ట్వీట్లో తెలిపారు. జూలై నుండి సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో రిలీజ్ కానుందట. రెజీనా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన అర్భాజ్ దక్షిణాదిన మలయాళ చిత్రంలో నటించడం గమనర్హం.