సినిమాల పరంగా స్టార్ హీరోల ఫైట్ ఎలా ఉన్నా ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. ఈమధ్య తెలుగులో స్టార్స్ స్నేహానికి కొత్త అర్ధం చెబుతున్నారు. ఇదిలాఉంటే కోలీవుడ్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాకు వేరే స్టార్ హీరో ఫ్యాన్స్ యాంటీ పబ్లిసిటీ, నెగటివ్ ట్రోల్స్ ఈమధ్య ఎక్కువయ్యాయి.  


అయితే ఎప్పుడో తమ అభిమాన నటుడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడని కోలీవుడ్ క్రేజీ హీరో ఓన్ టాలెంట్ తో పైకొచ్చిన శివ కార్తికేయన్ పై విజయ్ ఫ్యాన్స్ కసి తీర్చుకుంటున్నారు. మొదట్లో శివ కార్తికేయన్ తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే తమిళంలో అతను కూడా స్టార్ అయ్యాడు. 


అయితే లాస్ట్ ఇయర్ చేసిన సీమ రాజా ఫ్లాప్ అవగా ఈమధ్య వచ్చిన మిస్టర్ లోకల్ కూడా నిరాశపర్చింది. రెండు సినిమాలు ఫ్లాపులు కావడంతో శివ కార్తికేయన్ పై విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కు శివ కార్తికేయన్ బాగా దొరికాడని చెప్పొచ్చు. అప్పటి కసి తీర్చుకునేలా ఇప్పుడు యాంటీ ట్రోల్స్ చేస్తున్నారు.


స్టార్ హీరోల విషయంలో ఏదైనా మాట అనేముందు వారి ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుంటే బెటర్ అని మరోసారి విజయ్ ఫ్యాన్స్ ద్వారా తెలిసింది. సగటు హీరోని టార్గెట్ చేస్తూ శివ కార్తికేయన్ పై విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోలింగ్స్ కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. రజిని, కమల్ మూడు దశాబ్ధాలుగా స్టార్స్ గా ఉన్నా ఒకరి అభిమానులు ఒకరి మీద ఇలా ట్రోల్స్ చేసుకున్నది లేదు. కాని ఇప్పటితరం ఫ్యాన్స్ కు అదో ఫ్యాషన్ అయ్యింది.





మరింత సమాచారం తెలుసుకోండి: