‘బాహుబలి’ తో ప్రభాస్ ఇండియన్ సినిమా సెలెబ్రెటీగా మారిపోయాడు. అయితే ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ప్రభాస్ నటించిన సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో ‘సాహో’ పై విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘బాహుబలి’ స్థాయికి మించి అత్యధిక ధియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కాబోతున్న ప్రభాస్ వ్యూహాలకు ఊహించని విధంగా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సపోర్ట్ లభించడం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

‘సాహో’ జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించాలి అంటే బాలీవుడ్ లో కూడ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితీరాలి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ ప్రాజెక్ట్ పై హిందీ మూవీ ప్రేక్షకులలో మరింత క్రేజ్ పెంచడానికి ‘సాహో’ లో ఒక అతిథి పాత్ర చేయడానికి ప్రభాస్ రాయబారాలతో సల్మాన్ ఖాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో సల్మాన్ పాత్ర కేవలం 10 నిముషాలు మాత్రమే ఉన్నా అతడి ఇమేజ్ ‘సాహో’ కలక్షన్స్ సునామీకి చాల సహకరిస్తుంది అన్న ఉద్దేశ్యంతో ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు ఈమూవీని తెలుగు తమిళం హిందీ భాషలతో పాటు ఇండియాలోని చాల భాషలలో డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలతో పాటు ఈమూవీ చైనీస్ వర్షన్ పనులు కూడ కొనసాగుతున్నట్లు సమాచారం. 

దీనితో సాహో రిలీజ్ బాహుబలి స్థాయికి మించి ఉంటుందనీ ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ‘బాహుబలి’ రేంజ్ కి మించి ఉంటాయని అన్న అంచనాలను ఆ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వ్యక్త పరిచింది. అయితే ‘సాహో’ రిలీజ్ డేట్ ను ఆగష్టు 15న అంటూ డేట్ ముందుగానే బ్లాక్ చేసినా ఈవిషయాన్ని లెక్క చేయకుండా బాలీవుడ్ టాప్ హీరో అక్షయ కుమార్ మిషన్ ‘మంగల్’ జాన్ అబ్రహాం ‘బాట్ల హౌస్’ మూవీలు కూడ ‘సాహో’ మ్యానియాను లెక్క చేయకుండా అదేరోజు విడుదల కావడానికి రెడీ అవుతూ ఉండటం బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: