తెలుగు నటి అంజలి మరోసారి హర్రర్ క్యారెక్టర్ నటిస్తున్న చిత్రం లీసా 3డి. ఈ చిత్రం ఇప్పటికే సూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఆదివారం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి అంజలతో పాటు, దర్శకుడు విశ్వనాథ్, నిర్మాత సురేష్ కొండేటి, హస్యనటుడు శివాజీ రాజా, రాజు విశ్వనాధ్ తదితరులు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ల్ లో పాల్గొన్నారు. ‘24’ చిత్రానికి రచనా సహకారం అందించిన రాజు విశ్వనాత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
త్రీడీ టెక్నాలజీతో దెయ్యాన్ని చూపించి థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. కంటెంట్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగే కనిపిస్తుంది. ఓ పాత ఫామ్ హౌస్.. అందులో ఓ దెయ్యం.. కుర్చీలు ఊగడం.. కర్టెన్స్ కదలడం.. కరెంట్ పోవడం లాంటివి బ్లాక్ అండ్ కాలం నుండి చూస్తునే ఉన్నాం. అయితే హారర్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఇక టీజర్‌తో పెద్దగా భయపెట్టలేకపోయిన అంజలి దెయ్యం.. ‘లీసా’ మూవీతో దడపుట్టిస్తుందేమో చూడాలి.