యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాహుబలి రెండు భాగాల సినిమాలతో జాతీయ స్థాయి నటుడిగా విపరీతమైన పేరు మరియు మార్కెట్ ని ఆర్జించారు. ఇక ఆ సినిమా అనంతరం ఆయననుండి ప్రేక్షకులు అంతటి భారీ స్థాయి సినిమాలనే ఆశిస్తారు కనుక ఇకపై తాను చేయబోయే సినిమాలు కూడా భారీ లెవెల్లోనే చిత్రీకరణ జరుగుతాయని ఇటీవల ఒక నేషనల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ చెప్పుకొచ్చారు. 

ఇక ఆ విషయం అటుంచితే, చాలా రోజుల క్రితం షూటింగ్ ప్రారంభించుకున్న ఆయన తదుపరి చిత్రం సాహోకు సంబంధించి అప్పుడెప్పుడో చిన్న టీజర్ ఒకటి విడుదలైంది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆయన ఫ్యాన్స్ కు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ కూడా లేవు. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వలన సాహో షూటింగ్ వాయిదా పడడం కూడా దానికి ఒక కారణం. అయితే నేడు కాసేపటి క్రితం సాహోకు సంబంధించి తన అభిమానులకు రేపు తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రభాస్ ఒక వీడియో బైట్ ను విడుదల చేసారు. 

ఈ వీడియో బైట్, యువి క్రియేషన్స్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఇంతకి ప్రభాస్ రేపు సాహో గురించి ఏమి చెప్పబోతున్నారు, ఎటువంటి సర్ప్రైజ్ అయన ఫ్యాన్స్ కు ఇవ్వబోతున్నారు అనే దాని గురించి సినిమా వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. మరి అది ఏంటో తెలియాలంటే మాత్రం రేపటివరకు వేచి చూడవలసిందే. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు ఒకవేళ అది కనుక సాహో టీజర్ కు సంబందించి అప్ డేట్ అయితే మాత్రం వారి ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: