సీత ఇపుడు ఈ పేరు ఎవరూ పెద్దగా పెట్టుకోవడంలేదు. పెట్టుకున్న వారి వయసు దాదాపు ముప్పయి ఏళ్ళకు పైబ‌డే ఉంటుంది. ఆల్ట్రా మోడర్న్ రోజుల్లో సీత కధలు వినే ఓపిక ఉందా. అసలు సీత అంటే ఎవరు అనే వారు కూడా ఉన్నారు. రామాయణం అంటే ఏ భాషా చిత్రమని అడిగిన వారూ ఉన్నారు.


మరి ఈ టైంలో సీత అంటూ డైరెక్టర్ తేజా మూవీ తీశారు. దానికి తోడు లేడీ ఓరిఎంటెడ్ మూవీ ఇది. మరి ఈ సీతలో కధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. కామెడీ ఉంటుంది. ఫీట్లు, సాంగులు అన్నీ ఉంటాయని తేజా చెప్తున్నాడు. సీత అంటే ఫ్యామిలీ మూవీ అనుకోవద్దు అని మీడియా ముఖంగా విన్నపం చేసుకుంటున్నాడు.


ఇక కాజల్ సీతగా బాగా చేసిందని తేజా కితాబు ఇచ్చేశాడు. హీరో బెల్లంకొండ కూడా బాగా చేశాడని, విలన్ సోనూ సూద్ సూపర్ అంటున్నాడు. ఇక పాటలు, మాటలు, కధ, కధనం అన్నీ బాగా కుదిరాయని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ ఎంతో ఇష్టంగా తీశానని, మరి జనం కూడా నచ్చి మెచ్చుకుంటారని తేజా అంటున్నాడు.


నా నడ్డి విరగ్గొట్టి మరీ సీత పాత్ర చేయించారని హీరోయిన్ కాజల్ చెప్పింది. హిట్ కోసం చూస్తున్న బెల్లంకొండ ఇది కరెక్ట్ మూవీ అని లవ్ చేసేశాడు. మరి ఇందరు లవ్ చేస్తున్న ఈ సీత ఈ నెల 24న ధియేటర్లకు వస్తోంది. మరి ఎందరి మనసులు గెలుచుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: