వివేక్ ఒబెరాయ్ ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే నటుడిగా ఖేల్ ఖతం అయిపోయిన దశలో ఇటీవలే నరేంద్రమోడీ బయోపిక్ లో నటించాడితను. ఆ సినిమా బోలెడంత వివాదాన్ని రాజేసింది. ఆ సినిమా పై దుమారం రేగినప్పుడు వివేక్ ఒబెరాయ్ పొలిటికల్  కామెంట్లు చేశాడు. ఆ సంగతలా ఉంటే తాజాగా ఇతడు పెట్టిన ఒక ట్వీట్ పోస్ట్ పెద్ద వివాదంగా మారింది. ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు, అసలు ఫలితాలు వ్యత్యాసంగా ఉంటాయనే అంశాన్ని చెబుతూ తయారు చేసిన వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేశాడు వివేక్ ఒబెరాయ్.


ఆ ఫొటో పై విధంగా ఉంది. ఈ పోస్టు పెట్టిన కొద్ది సేపట్లోనే వివేక్ ఒబెరాయ్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. హద్దు మీరిన వ్యంగ్యం, అర్థంలేని వ్యంగ్యం అని వారంతా విరుచుకుపడ్డారు.  ఐశ్వర్యాయ్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడిపోయి ఇతడు ఆ పోస్టును పెట్టాడు. ఎవరో అనామకులు అలాంటి పోస్టును పెట్టి ఉంటే అదో లెక్క. ఐశ్వర్యకు తను మాజీ ప్రియుడు అనే ట్యాగ్ ను కలిగి ఉన్నవివేక్ ఇలాంటి పోస్టు పెట్టడం వివాదంగా మారింది.


ఈ విషయంలో అనేక మంది ఇతడి తీరును తప్పుపట్టారు. ఈ అంశంపై మహిళా కమిషన్  కూడా తక్షణం రియాక్ట్ అయ్యింది. ఈ నటుడికి నోటీసులు ఇచ్చింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వివేక్ తీరును తప్పు పట్టారు. అయితే అందరి మీదా ఎదురుదాడి చేస్తున్నాడితను. తను క్షమాపణలు చెప్పడానికి రెడీ అని, 'దేనికి క్షమాపణలు చెప్పాలో చెప్పండి..' అంటూ వివేక్ ఒబెరాయ్ ప్రశ్నిస్తున్నాడు. తను ఎలాంటి తప్పూ చేయలేదని అంటున్నాడు. అందరి మీదా ఎదురుదాడి చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: