మెగా స్టార్ చిరంజీవికి ‘ఇంద్ర’ లాంటి కథను ఇచ్చిన రచయిత చిన్ని కృష్ణ చాల పవర్ ఫుల్ కథలను చాలామంది హీరోలకు ఇచ్చాడు. అయితే చాలమంది రచయితలు దర్శకులుగా మారిన పరిస్థుతులలో చిన్ని కృష్ణ తన ప్రాభవాన్ని కోల్పోయాడు. అయినా మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఈ రచయిత పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

రెండురోజుల్లో తెలియబోతున్న ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ఇప్పటికే అనేక జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ చిన్ని కృష్ణ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటి వరకు వెల్లడి అయిన ఏ ఎగ్జిట్ పోల్ లోను పవన్ ‘జనసేన’ కు కేవలం 5 స్థానాలు లోపు మాత్రమే విజయం వస్తుంది అని వస్తున్న అంచనాలను చూసి చిన్ని కృష్ణ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

కేవలం మేకప్ వేసుకున్నంత మాత్రాన పవన్ ముఖ్యమంత్రి కాలేదని అంటూ ఈ ఎన్నికల ప్రచారం కోసం పవన్ వేసుకున్న పంచకట్టు గెడ్డం లుక్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను ఇలా మేకప్ వేసుకుంటే ముఖ్యమంత్రిని అయిపోతాన అంటూ మరొక సెటైర్ తన పై తానే వేసుకున్నాడు. 

అంతేకాదు పవన్ ఈ ఎన్నికల ఫలితాలు తెలిసిన వెంటనే మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోతాడనీ అతడితో సినిమాలు తీయబోయే నిర్మాతల పేర్లు కూడ తనకు తెలుసు అంటూ పవన్ కు వచ్చిన నష్టం లేదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ సినిమాలలో నటించే సందర్భంలో కథలు గురించి ఆసినిమాల బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి పట్టించుకోడు అంటూ తనలాంటి మంచి కథలు రాసే రచయితలు చెప్పే కథలను వినడానికి పవన్ ఆసక్తి కనపరచడు అంటూ తనకు పవన్ పై ఉన్న అసహనాన్ని బయటపెట్టాడు. గతంలో చిన్ని కృష్ణ రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ కు కథలు చెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు అన్న వార్తలు వచ్చాయి. బహుశా ఆ కోపం ఇప్పటికి చిన్ని కృష్ణ ద్వారా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ద్వారా బయటకు వచ్చింది అనుకోవాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: