ఇండస్ట్రీ రాజకీయాలకు చాల దూరంగా ఉంటాడు నాని. దీనితో ఇతడి పై నెగిటివ్ ప్రచారం చేయవలసిన అవసరం ఏవర్గానికి ఉండదు. అయితే ఈమధ్య కొందరు హీరోలు చేసుకున్న ఒక అర్దరాత్రి పార్టీలో నానీ గురించి ఆసక్తికర చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నాని విభిన్నమైన సినిమా కథలను ఎంచుకుంటూ సంవత్సరానికి రెండు సినిమాలు తనవైపు నుండి ఉండేలా అనుసరిస్తున్న వ్యూహాల పై చర్చలు జరిగినట్లు సమాచారం. 

అంతేకాదు తాము అంతా నానికన్నా ముందుగానే ఇందాస్త్రీలోకి వచ్చిన హీరోలం అయినా నాని తీరులో తామెందుకు సినిమాలు చేయలేకపోతున్నామని ఆ హీరోలు అంతా అంతర్మధనంలో తమలోని లోపాలను తమకు తాముగా విశ్లేషించుకున్నట్లు తెలుస్తోంది. ‘మజిలీ’ సినిమా సక్సస్ తరువాత నాగచైతన్య సమంతతో కలిసి సమ్మర్ ట్రిప్ కు వెళ్ళిపోతే మరి కొన్ని రోజులలో మహేష్ నమ్రతతో కలిసి లండన్ ట్రిప్ కు వెళ్ళిపోతూ ఇలా సినిమా సినిమాకు మధ్య ఫారెన్ ట్రిప్స్ కు వెళుతూ ఉంటే నాని మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా తన సినిమాలు వరసగా చేసుకుంటూ తమకు సవాల్ విసురుతున్నాడని అంటూ కొందరు ఆ పార్టీలో జోక్ చేసినట్లు టాక్. 

అయితే మరికొంతమంది హీరోలు మాత్రం నాని తాను నటించే సినిమా కథల ఎంపిక విషయంలో చాల వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడని అందుచేతనే నాని అంత వేగంగా సినిమాలు చేయగలుగుతున్నాడు అని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది హీరోలు తాము నటించే సినిమాల కథల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న కన్ఫ్యూజన్ నానీకి లేదు అంటూ కూడా ఆపార్టీకి వచ్చిన కొంతమంది హీరోలు అనుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ పార్టీలో కొంతమంది హీరోలు వ్యక్తపరిచిన అభిప్రాయాలలో కొన్ని నిజాలు లేకపోలేదు. ‘జెర్సీ’ మూవీ హిట్ అయినా ఆమూవీ సక్సస్ ను ఎంజాయ్ చేయడానికి చిన్న గ్యాప్ కూడ తీసుకోకుండా నాని తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను ఆగష్టు 30న విడుదల చేయడానికి యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేసి ఆతరువాత తాను నటించబోయే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలోని నెగిటివ్ పాత్రకు రెడీ అవుతున్నాడు. ఇలా ఏఒక్కరోజు వృధా కాకుండా అనుసరిస్తున్న వ్యూహాలు ఏకంగా ఇప్పుడు హీరోల అర్దరాత్రి పార్టీలలో కూడ హాట్ టాపిక్ గా మారుతున్నాయి అంటే నాని గురించి హీరోలు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: