ప్రెసెంట్ ఎన్టీఆర్ ఇక దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా ‘RRR’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. అయితే వచ్చే సంవత్సరం జులై మాసం లో విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత ఆ తర్వాత సినిమాను అప్పుడే త్రివిక్రమ్ లైన్ లో పెట్టి నట్లు సమాచారం.


ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కొంతమంది అభిమానులు కలుసుకున్నారు. ఆ సమయంలో రాజమౌళితో చేస్తోన్న సినిమా తరువాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా ఉంటుంది? అని అభిమానులు అడిగిన ప్రశ్నకి ఆయన త్రివిక్రమ్ పేరు చెప్పినట్టుగా తెలుస్తోంది.


ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అరవింద సమేత' అభిమానుల మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. మొత్తంమీద రాజమౌళి సినిమా అవకముందు మరొక డైరెక్టర్ ని అప్పుడే లైన్లో పెట్టేసాడు ఎన్టీఆర్.



మరింత సమాచారం తెలుసుకోండి: