రెండు రోజులలో వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలలో రాజకీయ పార్టీల భవిష్యత్ తో పాటు అనేకమంది ఫిలిం సెలెబ్రెటీల భవిష్యత్ ను కూడ తెల్చబోతున్నాయి. మన దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు కమలహాసన్ ఒకనాటి అందాల నటి సుమలత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కన్నడ యంగ్ హీరో నిఖిల్ గౌడాలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ ఎల్లుండి తేలబోతోంది. 

అదేవిధంగా ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగిన శత్రుఘ్న సిన్హా తెలుగు సినిమా రంగం నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన జయప్రద ఒకనాటి యూత్ కు క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఊర్మిళ ఇలా వీరందరి భవిష్యత్ ఎల్లుండి తెలియబోతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఒక్క పవన్ కళ్యాణ్ కు తప్పించి మిగతా ఏ ఫిలిం సెలెబ్రెటీలు గెలవరని సంకేతాలు వస్తున్నాయి. 

ముఖ్యంగా కమలహాసన్ స్థాపించిన ‘మక్కల్ నీడి మైమ్’ పార్టీకి కనీసం ఒకస్థానం కూడ రాదు అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తమిళనాడులో కమలహాసన్ కు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు లక్షల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. వీరిద్దరికీ వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. 

అయితే ఎన్నికల పోరాటంలోకి వచ్చిన పవన్ కలమహాసన్ లు జనం మధ్యకు వెళ్లి ఎంతో చైతన్య పూరితమైన ఉపన్యాసాలు చేసినా పవన్ కు సుమారు పది శాతం ఓట్లు కమలహాసన్ పార్టీకి కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి అని వస్తున్న అంచనాలు బట్టి భవిష్యత్ లో ఇక సినిమా సెలెబ్రెటీలు ఎవరు ఇక రాజకీయాలలోకి రాకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ధియేటర్లలో పవన్ కమలహాసన్ లు కనిపిస్తే చాలు పువ్వులు కురిపించే అభిమానులు అదే వారి సూపర్ హీరోలకు ఇలా తక్కువ శాతంలో ఓట్లు వేసారు అని అంచనాలు రావడంతో ప్రస్తుత సినిమా సెలెబ్రెటీలలో రాజకీయాలకు ఎవరు సరితూగరా అన్న సందేహాలు రావడం అన్నది సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: