టాలీవుడ్ లో బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి మరో భారీ సినిమాకు ప్లాన్ చేశారు.  ఈసారి మల్టీస్టారర్ పై ఫోకస్ చేసిన ఆయన ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ ల ‘ఆర్ఆర్ఆర్’మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రక రకాల అవాంతరాలు వస్తునే ఉన్నాయి. ఈ సినిమా కి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినపుడు కథ లోని పాత్రల గురించి వివరించారు రాజమౌళి. 

ఈ సినిమా 1920 నాటి పరిస్థితులకు సంబంధించినదిగా రాంచరణ్ (అల్లూరి సీతారామరాజ) పాత్రలో  ఎన్టీఆర్ (కొమురంభీమ్)పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన, తమిళ దర్శకుడు సుముద్రఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు చెప్పారు.  ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం,ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. ఈ ఇద్దరు హీరోలు కాస్త రెస్ట్ తీసుకొని షూటింగ్ కి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. 

మూడో షెడ్యూల్‌లో భాగంగా  హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.  డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్, అలియాభట్, అజయ్ దేవగాన్ లు నటిస్తున్నారు.  జూలై 30 2020లో విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: