నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత కూడ సమంత సినిమాల స్పీడ్ ను ఏమాత్రం తగ్గించలేదు సరికదా మరింత పెంచింది. ప్రస్తుతం సమంత దృష్టి అంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాల పైనే  ఉంది. ఇప్పటికే  ‘యు టర్న్’ మూవీ లో నటించిన సమంత త్వరలో ‘ఓ బేబీ’ మూవీతో పలకరించబోతోంది అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలందుకుని పెద్ద విజయం సాధించిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ కి ఇది రీమేక్. ఈ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘సురేష్ ప్రొడక్షన్స్’ బేనర్‌ ప్రారంభించి 55 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ని ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. 

ఈచిత్రంలో కీలక పాత్ర చేసిన సీనియర్ నటి లక్ష్మి బ్యాగ్రౌండ్లో కనిపిస్తుండగా చాలా మోడర్న్‌ లుక్‌లో చీర్ ఫుల్‌ గా ఉన్న సమంత లుక్ ను హైలెట్ చేస్తూ ఈఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఈసినిమాకు పని చేసిన  టెక్నీషియన్స్ అందరి  వివరాలతో పాటు ఒక ఆసక్తికరమైన ఊహించని పేరు కూడ వేసారు. ఆపేరు హ్యున్ థామస్ కిమ్. ఈపేరు చూడగానే ఇతడు ఎవరు అన్నసందేహం ఎవరికైనా కలుగుతుంది  ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్ గ్రానీ’ నిర్మాతల్లో అతనొకడు కావడం విశేషం. 

అయితే ఒక తెలుగు సినిమా పోస్టర్ పై ఒక విదేశీయుడు పేరు ఉండటం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. గతంలో విదేశీ సినిమాలను చడీచప్పుడు లేకుండా కాపీ కొట్టి తెలుగులో చాలా సులువుగా సినిమాలు తీసిన సంబర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పడు ఇలా చేయడం వల్ల వివాదాలు పెరిగిపోతున్న నేపధ్యంలో  అఫీషియల్‌ గా రీమేక్ హక్కులు కొని సినిమాలు చేస్తున్నారు. 

గతంలో ‘ఊపిరి’ విషయంలో కూడ అలాగే జరిగింది. అయితే ఆ తరువాత ‘అజ్ఞాతవాసి’ లో అలా చేయకపోవడంతో వివాదాలు వచ్చిన విషయం  తెలిసిందే. దీనితో బేబీ మూవీ పోస్టర్ పై హ్యున్ థామస్ కిమ్ పేరు గౌరవంగా వేసారా లేదా ఇతడికి కూడ ఈమూవీలో భాగస్వామ్యం ఉందా అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. దీనితో ఒక  తెలుగు సినిమా పోస్టర్ మీద విదేశీ నిర్మాత పేరు పడటం వెనుక ఏదోకారణం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: