సీత సినిమా ట్రైలర్, టీజర్ సినిమా మీద ఉన్న అంచనాలను ఇంకా పెంచేసింది. అయితే సీత సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. తను ఏ కథకు ఓకే చెప్పాల్సి వచ్చినా ముందుగా ఆ స్టోరీని తండ్రితో కలిసి వింటానని, తండ్రి బెల్లంకొండ సురేష్ అభిప్రాయం తీసుకున్న తర్వాతే సినిమాకు ఓకే చెబుతానని అన్నాడు. కానీ సీత విషయంలో మాత్రం తన తండ్రి మాటకు విరుద్ధంగా వెళ్లానని ప్రకటించాడు.


"నిజానికి మాకు తేజగారు 2 కథలు వినిపించారు. నేను, నాన్న కలిసి ఆ రెండు కథలు విన్నాం. సీత కంటే తేజ చెప్పిన మరో కథ నాన్నకు బాగా నచ్చింది. ఎందుకంటే అది మాస్-యాక్షన్ సబ్జెక్ట్. కానీ నాకు మాత్రం ఎందుకో సీత కథ నచ్చింది. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్నట్టు అనిపించింది. అందుకే నాన్న వద్దంటున్నా సీత సినిమాకు ఓకే చెప్పాను." ఇలా తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా సీత సినిమా చేశానని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. అందుకే ఈ సినిమా హిట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నట్టు తెలిపాడు. సీత సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు.


"2017లో నేను హీరోగా నటించిన జయజానకి నాయక, తేజ డైరెక్ట్ చేసిన నేనేరాజు నేనేమంత్రి, అనిల్ సుంకర నిర్మించిన లై సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అలా ఆ రోజు పోటీపడిన మేమంతా ఇప్పుడు కలిసి సినిమా తీశాం. సీత సినిమాతో మేం ముగ్గురుం కలిశాం." రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది సీత సినిమా. ఈ సినిమా రిజల్ట్ పై తనకు బెంగలేదంటున్నాడు సాయిశ్రీనివాస్. ఓ మంచి సినిమా చేశాననే తృప్తి తనకు కలిగిందంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: