మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోలో సక్సెస్ ఫుల్ జడ్జ్ గా ఉన్నారు. ఏపి ఎలక్షన్స్ వల్ల నాగబాబు జనసేన పార్టీ తరపున పోటీ చేసి కొన్నాళ్లు జబర్దస్త్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈమధ్య పలు ఇంటర్వ్యూస్ లో తాను ఎంపిగా గెలిచిన ఓడినా జబర్దస్త్ షోని మాత్రం వదలనని చెప్పాడు నాగబాబు. అయితే ప్రస్తుత పరిస్థితులు జబర్దస్త్ షోకి ఆయన దూరమయ్యేలా చేస్తున్నాయి.  


నాగబాబు ప్లేస్ లో సీనియర్ కమెడియన్ ఆలిని తీసుకుంటున్నారట. రోజా, నాగబాబు జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చిన టైంలో శేఖర్ మాస్టర్, మీనా, జానీ మాస్టర్ ను జడ్జులుగా పెట్టారు. ఎలాగు మంచి పేరొచ్చిన షో కాబట్టి జడ్జులు లేని ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. ఇదిలాఉంటే ఇప్పుడు నాగబాబు పూర్తిగా జబర్దస్త్ షోకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఆల్రెడీ రోజా మళ్లీ జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. రోజా, మీనా ప్రస్తుతం షో జడ్జులుగా ఉన్నారు. రీసెంట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంఘవి కూడా జడ్జుగా వచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఇక ఆలి మాత్రం పర్మనెంట్ జడ్జుగా వస్తున్నాడట. ఒకవేళ నాగబాబు మళ్లీ వచ్చే ఆలోచన చేస్తే తప్ప అప్ప్టివరకు ఆలినే జబర్దస్త్ జడ్జ్ గా ఉంటాడని తెలుస్తుంది.


ఆలి కూడా జబర్దస్త్ జడ్జ్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాడు. ఎలాగు ఆయన కమెడియన్ కాబట్టి ఆయన కూడా కొన్ని పంచులు వేయడానికి స్కోప్ ఉంటుంది. ఏది ఏమైనా జబర్దస్త్ లో ఈ కొత్త మార్పులు ప్రేక్షకులను ఒకింత సర్ ప్రైజ్ చేస్తున్నా ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. మరి ఫైనల్ జడ్జులు ఎవరన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: