కన్నడ పరిశ్రమకు చెందిన హీరో యశ్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉంది. అతను చేసిన కె.జి.ఎఫ్ సినిమా సంచలన విజయం అందుకుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ అదిరిపోయే హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కెజిఎఫ్ సినిమా సీక్వల్ రెడీ అవుతుంది.


ఇదిలాఉంటే ఎలాంటి సినిమా బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చిన యశ్ స్టార్ హీరోగా రాక్ స్టార్ గా ఎదగడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. సీరియల్స్ లో నటించిన యశ్ యాంకర్ గా, ప్రోగ్రామ్స్ హోస్ట్ గా కూడా చేశాడు. అంతేకాదు సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి.. టీ, సిగరెట్లు కూడా అదించాడట.    


ఈమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన టైంలో తను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్ సినిమా కష్టాలు అందరికి ఉండేవే ఓ డ్రైవర్ కొడుకు అయిన యశ్ కన్నడలో రాక్ స్టార్ అవడానికి చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. 


ప్రస్తుతం కె.జి.ఎఫ్ 2 సినిమా షూటింగ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను మించి ఈ సీక్వల్ ఉండబోతుందట. సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట. మొదటి పార్ట్ అందించిన ఘన విజయం స్పూర్తితో కె.జి.ఎఫ్ 2 అంచనాలను అందుకునేలా తీస్తున్నారట. అందుకే పార్ట్ 2 బడ్జెట్ కూడా భారీగా పెంచేశారు. మరి కె.జి.ఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: