ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సృష్టించిన సునామీతో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సందర్భంలో అనేకమంది ఆయనను అభినందిస్తూ సందేశాలు పంపుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ తో కలిసి 1వ క్లాస్ నుండి 12వ క్లాస్ వరకు కలిసి చదువుకున్న వరప్రసాద్ ఒక ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను తెలియచేసాడు. 

జగన్ తో కలిసి తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న తమ చిన్ననాటి రోజుల గురించి గుర్తుకు చేసుకుంటూ జగన్ తాను ఎప్పుడు ఎంతో గొప్పవాడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అన్న భేషజం లేకుండా తమ క్లాసులోని అందరితోను చాల ఆప్యాయంగా అభిమానంగా ఉన్న అలనాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు. జగన్ తరుచు తన స్నేహితులను అందరినీ తన ఇంటికి లంచ్ కి తీసుకు వెళ్ళడమే కాకుండా తన ఇంటిలోని పివీస్ ఎక్స్ ఎల్ 50 మోటార్ బైక్ ను డ్రైవ్ చేయడం నేర్పించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తాము చిన్నతనంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో బైక్ పై విపరీతంగా తిరిగిన అలనాటి రోజులను వరప్రసాద్ గుర్తుకు చేసుకున్నాడు.

అంతేకాదు తాము చిన్నప్పుడు తామంతా చిరంజీవి వీరాభిమానులమనీ చిరంజీవి సినిమాలను తామంతా కలిసి ఎంజాయ్ చేసిన సందర్భాలు తాము చదువుకునే రోజులలో ఎన్నో ఉన్నాయి అంటూ చెపుతున్న వరప్రసాద్ ప్రస్తుతం లేబర్ లా లో భాగ్యనగరంలో నిష్ణాతుడుగా పేరు సంపాధించుకున్నాడు. ఇదే సందర్భంలో ఆయన మరొక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. 

జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆల్ రౌండర్ గా రాణించిన అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటూ చిన్నతనలో స్కూల్ లీడర్ గా కొనసాగిన జగన్ ఒకసారి తన ప్రియమిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ కోసం తన స్కూల్ లీడర్ పదవిని త్యాగం చేసి సుమంట్ ను లీడర్ గా మార్చిన సందర్భం కూడ విజయ్ ప్రసాద్ గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కూడ జగన్ కు విపరీతంగా బహుమతులు వచ్చేవి అని తెలియ చేస్తూ ఎంత ఉన్నత పదవిలోకి వెళ్ళినా తన చిన్ననాటి స్నేహితులను గుర్తించడమే కాకుండా వారికి ఏ అవసరం వచ్చినా ‘నేనున్నాను’ అంటూ అందించే స్నేహ హస్తం తాను మరిచిపోలేను అంటూ వరప్రసాద్ చేసిన కామెంట్స్ ను బట్టి జగన్ లోని నాయకత్వ లక్షణాలతో పాటు ఆయనలోని మంచితనం కూడ మరొకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియని వారందరికీ తెలిసింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: