తెలుగుదేశం పార్టీ పెట్టింది అన్న నందమూరి తారకరామారావు. ఆయన్ని నాడు వెన్నంటి వుండి రాత్రి పగలు చైతన్య రధం నడిపిన తనయుడు నందమూరి హరిక్రిష్ణ పార్టీకి తొలి కార్యకర్త. మరి ఆయనకు టీడీపీలో ఎలాంటి ప్లేస్ దక్కిందో అందరూ చూసిందే.


ఇక అన్నగారి వెన్నుపోటు ఎపిసోడ్ తరువాత నందమూరి ఫ్యామిలీని మెల్లగా తప్పించి నారా చేతుల్లోకి పగ్గాలు తీసుకున్న చంద్రబాబు అయిష్టంగానే బాలయ్యకు 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారని అంటారు. అయినా బాలయ్య అక్కడ మంచి విజయం సాధించారు. కానీ మంత్రి పదవి  మాత్రం తన కొడుకు లోకేష్ కి ఇచ్చి బాలయ్యని బాబు పక్కన పెట్టారు.


ఇపుడు మంత్రి గా చేసి కీలకశాఖలు ఇచ్చిన లోకేష్ ఎన్నికల్లో తొలి సారి పోటీ చేసి  ఓడిపోయారు.  అన్నగారి అసలైన వారసుడు బాలక్రిష్ణ మాత్రం జగన్ వేవ్ లో కూడా 20 వేల మెజారిటీకి తగ్గకుండా గెలిచి రికార్డ్ స్రుష్టించారు. మరి గెలిచిన బాలయ్య ఇపుడు టీడీపీలోని 23 మందిలో గొప్ప లీడర్ గానే కనిపిస్తున్నారు. ఒక్క మగాడు ఆయనే మరి. 


పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ బాలయ్య ఇపుడు పార్టీకి పెద్ద దిక్కు అవుతాడా. డెబ్బయ్యేళ్ళ వయసులో ఉన్న చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చి పార్టీని మళ్ళీ కదనరంగంలోకి తీసుకెళ్ళి క్యాడర్ కి గట్టి భరొసా ఇచ్చే శక్తి ఆయనకు ఉందా. అందుకు నారా బాబు సహకరిస్తారా. అనుకూల మీడియా ఇకనైనా కళ్ళు తెరుస్తుందా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: